Header Banner

విజయశాంతికి పాదాభివందనం చేసిన నటుడు.. సోషల్ మీడియాలో వైరల్! ఆ సమయంలో..

  Sat Apr 12, 2025 10:15        Entertainment

నటి విజయశాంతికి సీనియర్ నటుడు పృథ్వీ పాదాభివందనం చేశారు. ఆ సమయంలో విజయశాంతి "మీరు నా చిన్న తమ్ముడు" అని అనగా, "నేను అక్కకు ప్రియమైన తమ్ముడిని" అంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు. వేదికపై జరిగిన ఈ ఆసక్తికర సంభాషణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరూ కలిసి ఎప్పుడు సినిమాల్లో నటించారా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. 1997లో వచ్చిన 'పెళ్లి' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీ దాదాపు 200లకు పైగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. 1999లో శరత్ కుమార్, విజయశాంతి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం 'రాజస్థాన్‌'లో పృథ్వీ నటించారు. ఆ తర్వాత వైజయంతి చిత్రంలోనూ విజయశాంతికి సోదరుడిగా చేశారు. కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: క్రికెట్ నిబంధనల్లో అనూహ్య మార్పులు.. ఐసీసీ కీలక నిర్ణయం! ఈ మార్పులపై చర్చించే అవకాశం..

 

ఈ చిత్రంలోనూ పృథ్వీ నటించారు. ఈ మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ‘ముచ్చటగా బంధాలే’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి చిత్ర బృందాన్ని పరిచయం చేస్తున్న క్రమంలో బబ్లూ పృథ్వీరాజ్‌ను వేదికపైకి ఆహ్వానించగా, ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విజయశాంతితో ఉన్న సోదర అనుబంధాన్ని, ఆమెతో నటించిన చిత్రాలను పృథ్వీ వెల్లడించారు. 

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AdhraPravasi #Prithviraj #Vijayasanti #ArjunReddy #TeluguCinema #Tollywood